భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం వాసవి క్లబ్ అధ్యక్షునిగా తోకల నాగేశ్వరావు ఎన్నికయ్యారు. స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నెషనల్ సభ్యుల సమావేశంలో భద్రాచలం వాసవి క్లబ్ 2025 కార్యవర్గంను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోకల నాగేశ్వరావు, ప్రధాన కార్యదర్శిగా అద్దంకి శ్రీనివాస మూర్తి, కోశాధికారిగా గుడుమాసు వెంకట సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ చారుగుళ్ల శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి బండారు కృష్ణయ్య, రీజినల్ చైర్మన్ మనోహర్, మాజీ అధ్యక్షులు, వాసవియన్స్ పాల్గొన్నారు.