13-04-2025 12:39:29 AM
* ఖరారు చేసిన కమలం పార్టీ
చెన్నై, ఏప్రిల్ 12: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా తిరునల్వేలి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగేంద్రన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు తమిళ బీజేపీకి అన్నా మలై అధ్యక్షుడిగా కొనసాగగా.. ఆయన వారసుడిగా నాగేంద్రన్‌ను పార్టీ నియమించింది.
2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో నాగేంద్రన్ పార్టీపై పార్టీ నేతలను ఏ విధంగా సమన్వయపరుస్తారో. 2026 ఎన్నికల కోసం తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. నాగేంద్రన్ బీజేపీలో చేరడానికి ముందు ఏఐఏడీఎంకేలోనే కొనసాగారు. 2001, 2011లో ఏఐఏడీ ఎంకే తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. జయలలిత మరణం తర్వాత ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.