calender_icon.png 16 October, 2024 | 7:46 PM

నూతనకల్ జడ్పీహెచ్ఎస్ నూతన పీడీ గా నాగేందర్

16-10-2024 05:08:07 PM

నూతనకల్సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నూతన ఫిజికల్ డైరెక్టర్(స్కూల్ అసిస్టెంట్)గా చెరుకు నాగేందర్ జాయిన్ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో టాపర్ గా నిలిచిన ఆయన బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ బి.రాములు ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అయ్యారు. జిల్లాలో ఉన్న ఏకైక పోస్టును సాధించుకున్న నాగేందర్ ని ఈ సందర్భంగా పలు ఉపాద్యాయ సంఘాల నాయకులతో పాటు ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు, అభినందించి, నూతనకల్ పాఠశాలకు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో టీపిటియు మండల అధ్యక్షులు బత్తుల ఉపేందర్, వివిధ సంఘాల నాయకులు ఇరుగు సోమయ్య, లింగారెడ్డి, సోంబాబు, శ్రీనివాస్, ఇరుగు యాదగిరి, అబ్రహాం, నాగయ్య, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.