calender_icon.png 14 March, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ అసోసియేషన్ లైజన్ ఆఫీసర్‌గా నాగశేషు నియామకం

13-03-2025 06:03:33 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో  ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న  గోడేండ్ల నాగశేషుని ఇల్లందు ఏరియా బీసీ అసోసియేషన్ లైజన్ ఆఫీసర్ గా నియమించారు. ఈ సందర్బంగా గురువారం  కోయగూడెం పిట్ ఆఫీస్  ఆవరణ కళ వేదికనందు  లీలా కృష్ణ  అధ్యక్షతన ఇల్లందు బీసీ అసోసియేషన్ కమిటీ  గజమాలతో ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేసించి కార్యదర్శి యస్. వి. యస్. యన్. రాజు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మేనేజంగ్ డైరెక్టర్ బాలరాంనాయక్ కృషితో  యావత్ సింగరేణి అన్ని ఏరియాలలో లెజెన్ ఆఫీసర్ ని నియమించు కోవడం జరిగిందన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ని బలోపేతానికి,  కమిటీలు వేసుకొని బలోపేతం చేద్దాము అని అన్నారు.

ఈ సందర్బంగా అసోసియేషన్ కోసం కార్యాలయాన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపాధ్యక్షులు సాంబయ్య మాట్లాడుతు అసోసియేషన్ పరముగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్  గోవింందరావు మాట్లాడుతూ..  కోయగూడెంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నా నాగశేషుకి లైజన్ ఆఫీసర్ నియమించడం శుభపరిణమము అని కొనియాడారు. కార్మికుల సమస్య లను తన దృష్టికి తీసుకు వస్తే న్యాయపరముగా పరిష్కరిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు, పులి పూర్ణచoదర్ రావు, ట్రజరర్ యాదగిరి, కోయగూడెం మేనేజర్  సౌరబ్ సుమన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివశంకర్. యస్సి, ఎస్ట్టీ  లైజన్ ఆఫీసర్ వుడేం బ్రమ్మం, యస్ ఓ శ్రీకాంత్, ఏఐటీయూసీ నుండి వెంకటేశ్వర్లు, సర్వర్. ఐ ఎన్ టి యు సి నుండి అశోక్,భూక్యా నాగేశ్వరావు, శ్రీనివాస్, బాసు, సూరి,  కోరిపెల్లి నాగేశ్వరావు, చారి, శివ తదితరులు పాల్గొన్నారు.