మంత్రిపై పెట్టిన కేసులో స్టేట్‌మెంట్ రికార్డ్ కోసం పిలుపు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): సమంత, నాగచైతన్య విడా కుల విషయంలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుం బ పరువుకు భంగం కలిగించాయని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీ నటుడు నాగార్జున కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పై నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషినర్ వాంగ్మూలం రికార్డు చేయాలన్న అశోక్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మంగళవారం నాగార్జునను హాజరుపరచాలని ఆదేశిస్తూ నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డు కోసం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.