calender_icon.png 17 November, 2024 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..

04-08-2024 06:05:37 PM

నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. సోమవారం ఉదయం అధికారులు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఇన్ ఫ్టో 3,21,875 క్యూసెక్కులు, ఔట్ ఫ్టో 37,873 క్యూసెక్యులు వరద ప్రవాహిస్తుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 574.90 అడుగులకు చేరింది. దీంతో సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిల్వ 268.86 టీఎంసీలు ఉంది. 

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి గంట గంటకు వరద ఉదృతి పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు పూర్తిగా నిండుకుండాలను తలపిస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, తుంగభద్రల నుంచి శ్రీశైలంకు 4,41,222 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీతో శ్రీశైలం క్రస్ట్ గేట్లో 10 గేట్లను 20 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.