calender_icon.png 28 October, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తివేత

28-08-2024 03:19:56 AM

నల్లగొండ/ గద్వాల (వనపర్తి), ఆగస్టు 27 (విజయక్రాంతి): నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల వరద చేరుతో ంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు మంగళవా రం రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు 16 వేల క్యూసెక్కుల జలాలను ది గువకు విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 9 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, పవర్ హౌస్ ను ంచి 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.0 0 అడుగుల వద్ద ఉంది. కర్ణాటకలోని నారా యణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్ట్‌లో కి 1.80 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 39  గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు జలాలు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.61 మీటర్ల వద్ద ఉంది. ప్రాజెక్టు నుంచి 1.84 లక్షల క్యూసెక్కుల జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తున్నాయి.