హైదరాబాద్: నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత రెండు మూడ్రోజుల నుంచి కురుస్తున్న బారీ వర్షాలకు సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాగార్జున సాగర్ డ్యామ్ నిండు కుండలా మారింది. దీంతో సాగర్ 4 క్రస్ట్ గేట్లును అధికారులు ఎత్తివేశారు. నాలుగు గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లూ, ఔట్ ఫ్లూ 76,555 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ లో ప్రస్తుత, పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉందని అధికారులు వెల్లడించారు.