calender_icon.png 2 October, 2024 | 7:46 PM

బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు.. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి

02-10-2024 05:46:59 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండని సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని  గౌరవించండన్నారు. బాధ్యత కలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అన్నారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణం అని తెలిపారు. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.