calender_icon.png 19 April, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం బంగ్లా గంగాదేవమ్మ వేడుకల్లో..

15-04-2025 12:00:00 AM

బోనమెత్తిన ఎమ్మెల్యే మందుల సామేల్ 

నాగారం, ఏప్రిల్ 14 ః నాగారం మండల కేంద్రం నాగారం బంగ్లా గ్రామంలో సోమవారం యాదవుల కుల ఆరాధ్య దైవం గంగాదేవమ్మ పండుగకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పాడి పంటలతో అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో  ఉండాలని అన్నారు . ఎమ్మెల్యే  బోనం ఎత్తుకొని సందడి చేశారు.

అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలు ఈటూరు లో ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింతరెడ్డిరాజగోపాల్ రెడ్డి మండలపార్టీఅధ్యక్షుడు తోడుసు లింగయ్య ఆకుల బుచ్చిబాబు సుంకరిజనార్ధన్ పానుగంటి నరసింహారెడ్డి పసుపులేటి వెంకటరెడ్డి కడియం పరమేశ్వర్ పాశం యాదవ రెడ్డి భయం వెంకన్న ముకుంద రెడ్డి  మోహన్ రెడ్డి సోమిరెడ్డి సోమయ్య వెంకన్న శ్రీనివాస్ రమేష్ యాదగిరి ఎల్లయ్య మల్లయ్య నరేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.