బెల్లంపల్లి (విజయక్రాంతి): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి మండలంలోని చంద్రవెళ్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర దేవాలయం నుండి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పంచపర్వాలుగా చెప్పుకునే ఏకాదశి నుండి మొదలుకొని ఐదు రోజులపాటు గ్రామంలోని అన్ని వీధుల గుండా నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సోమేశ్వర దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావాన్ని చాటాలని వారు కోరారు.