calender_icon.png 23 November, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ శవ రాజకీయాలను మానుకోవాలి..!

23-11-2024 02:23:27 PM

మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధం లేదు. 

పశువుల ఆసుపత్రి నిర్మాణ విషయంలో తనకు న్యాయమే జరిగింది. 

ప్రతిపక్ష నాయకులు నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే స్వీకరిస్తాం..

శవ రాజకీయాలు చేస్తే మాత్రం ఖబర్దార్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి. 

కల్వకుర్తి : బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేవలం సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న అక్కసు తోనే  కొండారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్యను శవ రాజకీయాలకు వాడుకుంటున్నట్లు స్పష్టం అవుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను సాయి రెడ్డి కుటుంబంతోపాటు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే చురుకుగా పనిచేస్తూ కొంత కాలం పాటు గ్రామ సర్పంచ్ గాను సాయి రెడ్డి సేవలందించారని వారి ఆత్మహత్య వారిని తీవ్రంగా బాధించిందన్నారు.

గ్రామ సర్పంచ్ గా తాను పదవిలో ఉన్న సమయంలో అందరూ తన మాట విన్నట్టుగానే నేటి తరం యువత, పెద్దలు కూడా ఇప్పటికీ తన మాటే నెగ్గాలే అనే విధంగా ప్రవర్తించేవాడని గ్రామ అభివృద్ధి కోసం నిర్మించిన పశువుల ఆసుపత్రిని అడ్డుకున్నప్పటికీ తాను కోరినట్లుగానే  ప్రభుత్వం అదనంగా దారి వదిలి నిర్మించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులే అడ్డుకొని గ్రామ పెద్దల సమక్షంలోనే సర్ది చెప్పడం జరిగిందన్నారు. ఆ తర్వాతే కల్వకుర్తి లోని తన ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు ఈ ఆత్మహత్యతో శవ రాజకీయాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ కేవలం సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబం పై బురద జిల్లాలన్న కుట్రలు మానుకోవాలన్నారు. తన సొంత గ్రామానికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే అత్యధిక నిధులు కేటాయించి అన్ని రకాల సౌలతో కల్పించారని పేర్కొన్నారు.