calender_icon.png 20 September, 2024 | 6:03 PM

రాజీ కేసుల పరిష్కారంలో న్యాయవాదులదే కీలక పాత్ర..!

20-09-2024 03:51:56 PM

పంతాలను పక్కకు నెట్టి పరిష్కారం మార్గాలను వెతకాలని సూచన.  

ప్రతినిత్యం ఉదయాన్నే లోక్ అదాలత్.

ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి. 

జిల్లా జడ్జ్ రమేష్ బాబు. 

నాగర్ కర్నూల్ విజయక్రాంతి: పంతాలు పట్టింపులతో తాతల కాలం నుంచి పోలీసు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న కక్షిదారులకు జాతీయ లోక్ అదాలత్ (రాజీమార్గం) ద్వారా న్యాయస్థానం మంచి అవకాశాన్ని కల్పించిందని న్యాయవాదులు కూడా పంథాలను పక్కన పెట్టి లోక్ అదాలత్ ద్వారా కక్షిధార్ల మధ్య రాజీ కుదిర్చే విధంగా ప్రయత్నించాలని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జ్ రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈనెల 28న జిల్లా న్యాయస్థాన ఆవరణలో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం బార్ అశోషియాసషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 పర్యాయాలు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ కోర్టు పరిధిలో మొత్తంగా 56,452 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారించడం జరిగిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా 9వ ర్యాంకులో ఉందని ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెద్ద మొత్తంలో కేసులు పరిష్కరించేలా న్యాయవాదులందరూ కృషి చేయాలన్నారు. సివిల్, క్రిమినల్, భార్యాభర్తల మధ్య గొడవలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్ వంటి వాటిని కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. కోర్టు సమయం కంటే ముందే ప్రతిరోజు ఉదయం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు కక్షి దారులు నేరుగా కోర్టును కూడా సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. లోక్ అదాలథ్ ద్వారా పరిష్కారమైన తీర్పులకు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమన్నారు. వారితోపాటు న్యాయ సేవాదికార  సంస్థ కార్యదర్శి, జడ్జి సబిత, మౌనిక, బార్ కౌన్సిల్ అధ్యక్షులు రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.