26-03-2025 02:03:01 AM
నల్లగొండ, మార్చి 25 (విజయక్రాంతి) : తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నల్లగొండకు చెందిన కందిమల్ల నాగమణిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతరావు ఆమెకు నియామక పత్రం అందించారు. మహిళా కాంగ్రెస్ విభాగం బలోపేతానికి నాగమణిరెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా పదవి ఇచ్చినట్లు సునీతరావు తెలిపారు.
ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మహిళలంతా పార్టీకి అండగా నిలవాలని కోరారు. తన నియామకానికి సహకరించిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు, జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల సుకన్య, దుబ్బ రూపకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.