calender_icon.png 7 March, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్లూ వీసీగా నాగలపల్లి నాగరాజు

07-03-2025 02:02:41 AM

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): హైదరాబాద్ ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)వర్సిటీ వీసీగా ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు ఏడాది తర్వాత వర్సిటీకు రెగ్యులర్ వీసీ వచ్చారు. ఐదేళ్ల కాలానికి వీసీగా ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నియమించారు.

దక్షిణ ఒడిశాలోని గజపతి జిల్లాలోని చంద్రపూర్‌కు చెందిన ప్రొఫెసర్ నాగరాజు ఆంగ్ల సాహిత్యంలో ప్రావీణ్యం పొందారు. విద్యారంగంలో పలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు 37 ఏళ్లకు పైగా బోధన, పరిశోధన, పరిపాలనా అనుభం ఉంది. కాగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ ప్రకాశ్‌బాబు పాండిచ్చేరి వర్సిటీ వీసీగా నియమితులయ్యారు.