న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ కిట్జ్‌బుహెల్ ఓపెన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆస్ట్రియా వేదికగా జరుగుతున్న ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో నాగల్ 6 1 7 (7/3)తో లుకాస్ క్లెయిన్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. తొలి సెట్‌ను ఈజీ గా గెలిచినప్పటికీ రెండో సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మక మూడోసెట్‌లో విజృంభించిన నాగల్ టై బ్రేక్‌లో విజయాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీ ముగిసిన వెంటనే నాగల్ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్నాడు.