calender_icon.png 25 February, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎపిక్ అడ్వెంచర్.. నాగబంధం

21-02-2025 12:00:00 AM

యువ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. హీరో విరాట్ కర్ణ, హీరోయిన్లు నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. గణేశ్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అభే ఓ దీనికి స్వరాలు సమకూర్చగా కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.