calender_icon.png 11 October, 2024 | 4:05 AM

బ్రిటన్‌లో ‘నాగా పుర్రె’ వేలం

11-10-2024 01:55:09 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని టెట్స్‌వర్త్‌లోని స్వాన్ వేలం హౌస్‌లో బుధవారం జరిగిన ఆక్షన్‌లో వివిధ దేశాలకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో వేలానికి పెట్టగా.. అందులో ‘19వ శతాబ్దానికి చెందిన కొమ్ములతో కలిగిన నాగ మానవ పుర్రెను వేలంపాటలో పెట్టగా.. అట్టి వేలాన్ని నిలిపివేయాలని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో నేతృత్వంలో నిరసనలు జరిగాయి.

పౌర సమాస సంస్థ ఫోరమ్ ఆఫ నాగా రీకన్సిలియేషన్ (ఎఫ్‌ఎన్‌ఆర్)  ఆధ్వర్యంలో నాగా పుర్రెను తిరిగి తమ దేశానికి ఇచ్చేయాలని డిమండ్ చేశారు. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలని నాగాలాండ్ విదేశాంగ మంత్రి కోరారు. ఈ నేపథ్యంలో భారత అభ్యర్థన మేరకు అందరి మనోభావాలను గౌరవిస్తూ నాగా పుర్రె వేలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వేలం హౌస్ యజమాని టామ్ కీన్ తెలిపారు.