హీరో నాగశౌర్య నూతన చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవీఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన రామ్ దేశిన (రమేశ్) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారమే ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమ్మక్ చంద్ర, శివన్నారాయణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా, హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాకు ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పృథ్వీ; కొరియోగ్రఫీ: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, శోబి పాల్ రాజ్; పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి్త, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్.