21-02-2025 12:00:00 AM
‘తండేల్’ సినిమా విజయాన్ని అందుకోవటంతో నాగచైతన్య మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేసినట్టయ్యింది. అదే జోష్‌లో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నాడీ అక్కినేని యువ హీరో. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన మేకర్స్ ఈ సినిమాను మార్చి నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం.
మరోవైపు ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు సైతం చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టు స్క్రీన్‌ప్లేపై కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. మిస్టీక్ హారర్ థ్రిల్లర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రం కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనుందీ చిత్రబృందం. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సెట్లను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.