calender_icon.png 31 January, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఇంట్లో నా పరువు నిలబెట్టాల్సింది మీరే..!

28-01-2025 09:07:29 PM

'తండేల్' వైజాగ్ ఈవెంట్‌లో నాగచైతన్య...

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్’. కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. డీవోపీగా శమ్దాత్, ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనాగేంద్ర తంగల పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో మంగళవారం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత అల్లు అరవింద్‌తోపాటు హీరో నాగచైతన్య హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. మన పుష్ప కా బాప్ అల్లు అరవింద్. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనవి. నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. వైజాగ్ విషయానికి వస్తే .. ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే. కాబట్టి మీకో రిక్వెస్ట్.. తండేల్ సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే ఇంట్లో నా పరువుపోతుంది (నవ్వుతూ). ఈపాలి యాట తప్పేదేలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే’ అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మేము ఎంత కష్టపడి తీసినా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. చందు మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయిపల్లవి అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్‌ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్రవాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.