calender_icon.png 30 April, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ స్థాయి నాట్య పోటీలలో నాగ అలేఖ్యకు నంది అవార్డు

29-04-2025 09:57:33 PM

గజ్వేల్: శ్రీ రాగ రమ్య కల్చరల్ అండ్ సోషల్ అండ్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అంతర్జాతీయ నృత్య పోటీలలో గజ్వేల్ పట్టణానికి చెందిన నాగ అలేఖ్య నంది అవార్డు అందుకున్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు లక్ష్మీ పద్మజ  స్థానిక చిన్నారులు యువతులకు నృత్య శిక్షణ కూడా ఇస్తుంటారు. నృత్య శిక్షకురాలు లక్ష్మీ పద్మజ చొరవతో  రవీంద్ర భారతిలో  నిర్వహించిన అంతర్జాతీయ నృత్య పోటీలలో  నాగ అలేఖ్య పాల్గొని తన అద్భుత ప్రదర్శనతో  నంది అవార్డును గెలుచుకుంది. నాగ అలేఖ్య హైటెక్ సిటీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది.