calender_icon.png 30 October, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నస్రల్లా వారసుడిగా నయీమ్ ఖాస్సెమ్

30-10-2024 04:49:35 AM

అధికారికంగా ప్రకటించిన హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ

మూడు దశాబ్దాల పాటు నస్రల్లాకు డిప్యూటీగా పనిచేసిన నయీమ్

గెలుపు పోరాటం ఆపేది లేదన్న నయీమ్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాకు వారసుడిగా.. ఆ సంస్థ ఎవరిని ప్రకటిస్తుందో అనే ఉత్కంఠకు తెరపడింది. అదే సంస్థలో గత మూడు దశాబ్దాలుగా నస్రల్లాకు డిప్యూటీగా, అతడి మర ణాంతరం యాక్టింగ్ లీడర్‌గా పనిచేస్తున్న నయీమ్ ఖాస్సెమ్‌ను.. కొత్త చీఫ్‌గా సురా కౌన్సి సభ్యులు ఎన్నుకున్నారు. ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న యుద్ధంలో విజయం సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదని హెజ్‌బొల్లా కొత్తబాస్ నయీమ్ ప్రకటించారు. మరోవైపు పాలస్తీనాలోని ఓ ఎత్తున భవనంపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడి లో 60 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

నయీమ్ ఖాస్సెమ్ నేపథ్యం

హెజ్‌బొల్లాకు నూతన బాస్‌గా ఎన్నికైన నయీమ్ ఖాస్సెమ్ దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్‌ఫిలా పట్టణంలో 1953లో జన్మించాడు. తొలుత లెబనీస్ విశ్వవిద్యాలయంలో నయీమ్ కెమెస్ట్రీ లెక్చరర్‌గా పనిచేశాడు. 1970లో లెబనాన్‌లోని షియా అమల్ ఉద్యమంలో ఆయన భాగమయ్యాడు. 1982లో హెజ్‌బొల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. 1991 నుంచి ఆయన హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్నాడు. సస్రల్లాకి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నయీమ్.. నస్రల్లా మరణాంతరం హెజ్‌బొల్లా యాక్టింగ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. నస్రల్లా మరణాంతరం ఇప్పటివరకు మూడు మీడియా ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. 

సభ్యులను ఏకతాటిపైకి తేవడంలో కీలకపాత్ర..

నస్రల్లా మరణంతోనే యుద్ధం ముగియలేదని హెచ్చరించిన న యూమ్ కాల్పుల విరమణే యుద్ధం ముగింపునకు ఉన్న  ఏకైక మార్గం అని ప్రకటించాడు. నస్రల్లా మరణాంతరం గ్రూప్ సభ్యులను ఏక తాటిపైకి తీసుకురావడంలో నయీ మ్ కీలక పాత్ర పోషించాడు. ఢీలా పడ్డ సైన్యంలో స్ఫూర్తి నింపేలా ప్ర సంగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇజ్రాయెల్ కాల్పుల విరమ ణకు లెబనాన్ చేసిన ప్రయత్నాలకు నయీమ్ పూర్తి మద్దతు తెలిపాడు. ఈ ప్రతిపాదనను ఒకవేళ ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే వారికి గట్టిగా బుద్ధిచెబుతాం అని నయీమ్ అప్ప ట్లో ప్రకటించడం సంచలనంగా మా రింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే ఆ దేశపు నడిబొడ్డున దాడిచేసి చూపిస్తాం అని నయీమ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.