calender_icon.png 17 November, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదీమ్‌కు భారీ నజరానాలు

14-08-2024 11:28:26 PM

ఇస్లామాబాద్: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి పాక్ పేరును అంతర్జాతీయ వేదిక మీద మార్మోగించిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ మీద అక్కడి ప్రజలు, ప్రభుత్వం నజరానాలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ 150 మిలియన్ల (5,38,000 డాలర్లు) రివార్డు ప్రకటించాడు. అంతే కాకుండా పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఏకంగా అర్షద్ ఇంటికి వెళ్లి.. 100 మిలియన్ల  (3,59,000 డాలర్లు) నజరానా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా నదీమ్‌కు “పాక్ 92.97” అనే స్పెషల్ నెంబర్‌తో ఉన్న కారును కూడా బహుమతిగా అందించింది. ఇక నదీమ్ కోచ్ సల్మాన్ 5 మిలియన్లు (18,000 డాలర్లు) బహుమతిగా అందించాడు. మరియం నవాజ్ మాట్లాడుతూ.. ‘250 మిలియన్ల పాక్ ప్రజల ఆనందాన్ని నీవు రెండింతలు చేశావు. ప్రస్తుతం ప్రతి పాకిస్తానీ గర్వంతో ఉన్నాడు. వారి ఆనందానికి అవధుల్లేవు’ అని మరియం అన్నారు. ఇక ఒలింపిక్ జావెలిన్ త్రో పోటీల్లో పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్ రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల మేర బల్లెం విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.