calender_icon.png 18 April, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేష వాహనంపై ఊరేగిన నాచగిరి లక్ష్మీ నరసింహుడు

24-03-2025 10:25:16 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం లక్ష్మీనరసింహుడు శేష వాహనంపై పురవీధుల్లో ఊరేగాడు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వామివారిని శేష వాహనంపై కూర్చోబెట్టి ఆలయం నుండి మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఘనంగా ఊరేగించగా స్వామివారిని భక్తులు దర్శించుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.