హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహిం చడమే నాబార్డ్ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు అన్నారు. నాబార్డ్ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాబార్డ్ ప్రధాన కార్యాలయంలో సీజీఎం సుశీల చింతాల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ (ఫైనాన్స్ అండ్ ప్లానింగ్) కే రామకృష్ణరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన నిధులను సహకార బ్యాంకు లు, వాణిజ్య బ్యాంకుల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ.3.5 లక్షల కోట్లను రీఫైనాన్స్ రూపంలో నాబార్డ్ అందజేస్తున్నదని చెప్పారు.
ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా దాదాపు రూ.460 కోట్లు రుణ సదుపాయం పొందగలిగామన్నారు. గ్రామీ బ్యాంకులను అభివృద్ధి చేయడంలో నాబార్డ్ ముందుంటుందని చెప్పారు. ఆర్బీఐ జీఎం అంజనీమిశ్రా, ఐఐఎమ్మార్ డైరెక్టర్ తారా సత్యవతి, ఏజీహబ్ ఎండీ కల్ప న, ఏఈడీఈఏ సీఈవో డా.ఎస్ సెంథిల్, ఏపీజీవీబీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, టీజీబి చైర్మన్ వై శోభ, టెస్కాబ్ సీజీఎం టీ జ్యోతి పాల్గొన్నారు.