calender_icon.png 15 February, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాబార్డ్ రుణాలు రూ.3.85 లక్షల కోట్లు

15-02-2025 01:40:44 AM

  1. ఎంఎస్‌ఎంఈలకు అత్యధికంగా రూ.2.03 లక్షల కోట్లు
  2. వ్యవసాయ రంగానికి ద్వితీయ ప్రాధాన్యం 
  3. ఈ రంగానికి కేటాయింపులు 1.63 లక్షల కోట్లు
  4. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనాలు విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండన్ రూరల్ డెవలప్‌మెం ట్ (నాబార్డ్) 2025-26 ఆర్థిక సంవ త్సరంలో తెలంగాణకు రూ.3.85 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని అంచనా వేసిం ది.

ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, ఆహార ప్రాసె సింగ్, ఎంఎస్‌ఎంఈలు, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ గృహనిర్మాణం, సామాజికపరమైన మౌలిక సదుపాయా ల వంటి కీలక రంగాలకు ఈతమివ్వాలనే నిశ్చయానికి వచ్చి ‘తెలంగాణ స్టేట్ ఫోకస్ పేపర్ -2025’ పేరుతో శుక్రవా రం వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసింది.

రుణాల్లో అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లను ఎంఎస్‌ఎంఈలకు కేటాయించాలని అంచనా వేసింది. ఇది మొత్తం రుణాల్లో 57శాతం కావడం గమనార్హం. గతేడాది ఈ రంగానికి కేవలం రూ.1.29 లక్షల కోట్లే కేటా యించి ఈసారి పెంచడం గమనార్హం. సాధారణం గా నాబార్డ్ ప్రభుత్వ, ప్రైవేట్, వ్యాపార రుణాలు అందిస్తుంది.

సదరు రుణాలు తీసుకునేవారు కచ్చితంగా నాబార్డ్ నిబంధనలు పాటించాల్సి ఉం టుంది. దీని దృష్టి ఎల్లప్పుడూ గ్రామీ ణాభి వృద్ధిపైనే ఉంటుంది. గడిచిన పదేళ్లలో నాబార్డు రాష్ట్రప్రభుత్వా నికి రూ.లక్షల కోట్ల రుణాలు అందించగా, వీటిలో రూ.33 వేల కోట్లను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వాటర్‌షెడ్ల అభివృద్ధి, గిరిజన అభివృద్ధి, స్థిరమైన వ్యవసాయం వంటి కీలకమైన అంశాల్లో నాబార్డ్ అటు ప్రభు త్వానికి, ఇటు వ్యాపా రులకు మద్ద తుగా నిలిచింది. నా బార్డ్ గతేడాది వార్షిక రుణాలను రూ.2.80 లక్షల కోట్లు అంచనా వేయగా, ఈసారి ఆ మొత్తాన్ని 38శాతం పెంచింది.

వ్యవసాయ రంగానికి 1.63 లక్షలకోట్లు..

 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ వ్యవసాయ రంగానికి ద్వితీయ ప్రాధాన్యతను ఇచ్చిం ది. పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1.63 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది ఈ రంగానికి రూ.1.33 లక్షల కోట్లు మాత్రమే కేటాయించి, ఈ సారి రుణాలను 23శాతం పెంచింది. నాబార్డ్ కేటాయించిన మొత్తం రుణా ల్లో  వ్యవసాయం రంగానికి 36శాతం వాటా ఇవ్వడం గమనార్హం. అలాగే ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రంగాల వాటా 93శాతం కావడం మరో విశేషం.