calender_icon.png 27 December, 2024 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ జానారెడ్డి

27-12-2024 03:00:25 AM

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): అఖిల భారతీ య విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ జానారెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 23 నుం చి 25 వరకు సిద్దిపేటలో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహా సభల్లో రాష్ట్ర అధ్య క్షుడిగా ఎన్నికైనట్టు జానారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

బ్రిటిష్ వలసవాద మూలాలున్న విద్యా విధానాన్ని తొలగించి భారతీయతతో కూడిన విద్యా విధానమైన ఎన్‌ఈపీ రూపకల్పనకు ఏబీవీపీ కృషి చేసిందని పేర్కొన్నారు. సిద్దిపేటలో జరిగిన ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు 1,200 మంది విద్యార్థి ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరైనట్టు తెలిపారు.