calender_icon.png 8 January, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 గంటల పనంటే భార్య పారిపోతది!

01-01-2025 01:33:17 AM

* నచ్చిన పనులు చేస్తేనే సమతుల్యత

* ఒకరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని మరొకరిపై రుద్దొద్దు

* అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ

ముంబై, డిసెంబర్ 31: భారత్ అభివృద్ధి చెందాలంటే వారానికి 70 గంటలపాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం వల్ల కలిగే పరిణామాల గురించి కూడా వివరించారు. ఒకరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని మరొకరిపై రుద్దొద్దన్నారు.

ఎవరైనా కుటుంబంతో నాలుగు గంటలు గడిపితే వారు ఆనందం పొందుతారని..  ఆఫీసులో ఎనిమిది గంటలు గడుపుతానంటే బీవీ భాగ్ జాయేగీ( భార్య పారిపోతుంది) అని అన్నారు. మీకు నచ్చిన పనులు చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని చెప్పారు. మాకు కుటుంబం, ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం లేదన్నారు.

పిల్లలు కూడా ఇవే విషయాలను గమనించి ఆచరిస్తారని ఆయన పేర్కొన్నారు. భూమిపైకి శాశ్వతంగా ఉండేందుకు ఎవరూ రాలేదన్నారు. దీన్ని అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం సరళంగా మారుతుంది అని అదానీ అన్నారు. మృత్యువు అనే వాస్తవాన్ని అంగీకరించినపుడే జీవితం సాదాసీదాగా మారుతుందని ఆయన వెల్లడించారు.

కాగా వారానికి అయిదు రోజుల పనిదినాలు ఉండడంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారానికి 70 గంటలపాటు పనిచేయాలని సూచించారు.