28-08-2024 03:07:38 AM
కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): వ్యక్తిగత పనుల నిమిత్తమై రెండు వారాల పాటు అమెరికాకు పర్యటనకు వచ్చినట్లు.. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మేయర్ అమెరికా నుంచి ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. ‘నా అమెరికా పర్యటనను పూర్తిగా మున్సిపల్ చట్టం ప్రకారంగానే రెండు వారాలపాటు రూపొందించుకున్నాను. నా పర్యటనలో ఎలాంటి దాపరికాలు లేవు’ అని మేయర్ తెలిపారు. అయితే కొందరు కావాలనే నా పర్యటనను కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ కాంక్షతో చల్లా హరిశంకర్, ఆయన సతీమణి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి నా మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.