calender_icon.png 21 September, 2024 | 12:19 AM

‘నా కొడుకే నా సీక్రెట్ వెపన్’

06-09-2024 12:11:59 AM

  1. ఎన్నికల్లో ‘ట్రంప్ కార్డ్’గా బారన్ 
  2. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

న్యూయార్క్:  నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన కుమారుడు బార న్ తనకు ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగపడతాడని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో 41 మిలియన్ల యువ ఓటర్లు ( జనరేషన్ జీ) ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో వారి ఓట్లను రాబట్టుకోవడానికి అభ్యర్థులు ట్రంప్, కమలా హారిస్ ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిని ఆకట్టుకునేందుకు సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లను కమలా ఉపయోగిస్తున్నారు. దీంతో యువ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు తన వద్ద ‘సీక్రెట్ వెపన్ ’ఉందని, అది తన కుమారుడు ‘బారన్ ట్రంప్’ అని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“17 ఏండ్ల బారన్ నా దృష్టిలో ఇంకా చిన్నపిల్లాడే. అథ్లెట్, తెలివైన వ్యక్తి కూడా. మంచి కుర్రాడు. యూత్‌ను ఆకట్టుకోవడం ఎలాగో తెలుసు. దీంతో జనరేషన్ జీ ఓటర్ల విషయంలో మేం విజయం సాధించినట్లే. ఇప్పటికే ప్రజల దృష్టిని ఆకర్షించాడు.” అని డొనాల్డ్ చెప్పారు.  ట్రంప్‌ె మెలానియా కుమారుడైన బారన్ కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. తన తండ్రి తరఫున ఫ్లోరిడాలో ప్రచారంలో పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికలల్లో హోరాహోరీ పోటీ జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన తండ్రిని గెలిపించడానికి యువ ఓటర్లపై బారన్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో చూడాలి.