17-03-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ మార్చి 16 (విజయ క్రాంతి) : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆగంతకుడు చొరబడిన ఘటనపై మహబూబ్ నగర్ లో ఎంపీ డీకే అరుణ ఎన్నో అనుమానాలు తావు ఇస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఎంపీ డీకే అరుణ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతరాత్రి హైదరాబాద్ లోని నా ఇంట్లో జరిగిన ఆగంతకుడి చొరబాటు ఘటన భయాందోళన కు గురి చేస్తుందని పేర్కొన్నారు.
నేను సీఎం ఉండే ఏరియాలోనే ఉంటానని, అయినా దుండగులు చొరబడుతున్నారు అంటే ఆశ్చర్యానికి గురిచేస్తుందని తెలిపారు. గతరాత్రి ఓ దుండగులు నా ఇంట్లోకి వెనక కిచన్ లోకి ప్రవేశించి గంటన్నరపాటు కలియదిరిగి వెళ్లిపోయాడని వివరిం చారు.
ఇది ముమ్మాటికీ అనుమానాలకు తావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు దుండగులు నా ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడో ? అన్నవిషయం ఆలోచిస్తేనే భయం వేస్తోందన్నారు. ఈ విషయంపై సీఎం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు.
అసలు జరిగింది ఇది...
గడచిన రెండు రోజులగా మహబూబ్ నగర్ లోనే ఉన్నామని, గత అర్థ రాత్రి 3 గంటలకు కిచెన్ కిటికీ తీసి ఇంట్లోకి వచ్చారని, ఇల్లంతా ఒక గంటన్నర పాటు ఇంట్లో కలియతిరిగారని తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు నాకు తెలిసిందని, కిచెన్ లో కెమెరా కట్ చేశాడని, కింద గ్లాస్ తీసేసి ఇంట్లోకి వచ్చాడన్నారు. ముఖానికి మాస్క్, గ్లౌస్, బ్యాగ్ ,షూ ధరించాడని పేర్కొన్నారు.
పస్ట్ ఫ్లోర్ లోకి వెనుక భాగం నుంచి కిచన్ కిటికిలోంచి లోనికి ఎంటర్ అయ్యాడని, నక్కి నక్కి తిరుగుతూ రెక్కీ చేసిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. కిచెన్ లో కెమెరా కట్ చేయడం జరిగిందని,డైనింగ్ హాల్ లో కెమెరా తిప్పేశాడని పేర్కొన్నారు. డ్రాలు తెరిశాడని, అన్ని చిందర వండర పడేశాడన్నారు. ఫస్ట్, సెకెండ్ ఫ్లోర్లలోని అన్నిరూములు తిరగడం జరిగిందని, రెండవ ఫ్లోర్ లో కి వెళ్ళాడతో పాటు అంతా కలియ తిరిగాడని పేర్కొన్నారు.
నక్కుకుంటూ వెళ్ళిపోయాడని, ఆదివారం తెల్లవారు జామున 4:30నిమిషాలకు ఇంట్లోంచి వెళ్లిపోయాడన్నారు. గంటన్నర పాటు వాడు నా ఇంట్లో ఏం రెక్కీ చేశాడో అర్థం కావడం లేదన్నారు. ఈ ఘటన ఊహించుకుంటేనే భయం వేస్తోందని,అగంతకుడు వచ్చి నప్పుడు ఇంట్లోవాళ్లు ఎవరైనా చూసి ఉంటే.. చంపేసేవాడేమో.. ఏం జరిగేదో ఊహించుకుంటేనే ఆందోళనకరంగా ఉందన్నారు.
నా ఇంట్లోంచి చిన్నకర్చిప్కూడా పోలేదు
నా ఇంట్లో నుంచి చిన్న కర్చు కూడా పోలేదని, నా మనవరాలు రూమ్ లోకి వెళ్లడం జరిగిందని, నా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలే ఉంటారని వారు మేలుకో వచ్చుంటే ఏం జరిగి ఉండేదని పేర్కొన్నారు. దుండగుడు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్లారు అనే విషయాలు పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేసి తేల్చాలని పోలీసులను కోరారు.
ఈ విషయంపై ఇంటెలిజెన్స్ ఐజి తో మాట్లాడడం జరిగిందని తెలియజేశారు. నాకు ప్రాణహాని తల పెట్టాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం అవుతుందని, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.