calender_icon.png 17 November, 2024 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా రాజకీయ జీవితం సహకార రంగం నుంచే

29-06-2024 01:52:20 AM

  • మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): తన రాజకీయ జీవితం సహకార రంగం నుంచే ప్రారంభమైందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతం లో తాను మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశానని గుర్తు చేశారు. రైతులకు నిజాతయితీగా సేవ చేశానన్నారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ హోదాలో తాను అడగగానే నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు.

సహకార రంగాల ద్వారా వరిధాన్యం, మొక్కజొన్న కొనాలని జీవోలు తెచ్చామని వెల్లడించారు. క్రిబ్‌కో డైరెక్టర్‌గా అన్ని రాష్ట్రాలు పర్యటించానని, సహకార రంగం నుంచి వివిధ దేశాల్లో పర్యటించి అక్కడి పనితీరును అధ్యయనం చేశానని మంత్రి చెప్పారు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాడి పంటలు, రైతుల అభివృద్ధికి కృషి చేయాలని నాబార్డు అధికారులకు సూచించారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, సీఈవో సత్యనారాయణరావు పాల్గొన్నారు.