ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా ప్రకటన
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సైబర్ నేరగాళ్లు తన ఫోన్, ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేశారని ఇండియన్ ఓవర్సీస్ కాం గ్రె స్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన పేరుతో ఎలాంటి మెయిల్స్, మె స్సేజ్‌లు వచ్చినా ఎవరూ స్పందించవద్దని, లింక్‌లను క్లిక్ చేయవద్దని ఆ యన విజ్ఞప్తి చేశారు. కొన్ని వారాలుగా తన సర్వర్ కూడా హ్యాక్ అవు తోందన్నారు. క్రిప్టో కరెన్సీ రూపం లో వేల డాలర్లు చెల్లించాలని తనను హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అడిగిన మొత్తం చెల్లించక పోతే తన ప్రతిష్టను దెబ్బతీస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరించారని ఆయ న వెల్లడించారు.తాను ప్రస్తుతం విదే శీ పర్యటనలో ఉన్నందున వాటిని వెంటనే బ్లాక్ చేయడానికి వీలు లేదన్నారు. చికాగోకు వచ్చాక హ్యాకింగ్‌పై చర్యలు తీసుకుంటానని తెలిపారు.