calender_icon.png 5 March, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రసాద్ అనే నేను..

04-03-2025 12:00:00 AM

సప్తగిరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న అవుట్- అండ్-అవుట్ ఎంటర్టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ గ్రూప్‌నకు చెందిన కె.వై. బాబు, థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా టీజర్‌ను ప్రభాస్ లాంచ్ చేశారు.

“ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తు న్నా” అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్స్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఇది ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది.

శాసనాల గ్రంథం ప్రకారం అతను పెళ్లి చేసుకోవడానికి కనీసం రూ. 2 కోట్ల రూపాయలు కట్నం తీసుకోవాలి.- అంతకన్నా తక్కు వ అయితే కుదరదు. మరో సవాల్ ఏమిటంటే, కట్నం నగ దు రూపంలో చెల్లించాలి. ఇంత కఠినమైన పరిస్థితులలో సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ (శాశ్వత బ్రహ్మచారి)గా ఎప్పటికీ ఉంటాడా? పెళ్లి అవుతుందా? అనేది చాలా హిలేరియస్‌గా ప్రజెంట్ చేశారు. ప్రియాంకశర్మ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో అలరించారు.