calender_icon.png 22 January, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు అభివృద్ధే నా ధ్యేయం

05-07-2024 12:28:55 AM

ఎంపీ డీకే అరుణ 

మహబూబ్‌నగర్, జూలై 4 (విజయక్రాంతి): పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణకు బీజేపీ నాయకులు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం పీఎం నరేంద్రమోదీ శ్రమిస్తున్నారని, పాలమూరు అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమిస్తానన్నారు.

అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కంటే మహబూబ్‌నగర్ అత్యుత్తమంగా ఉండేలా చేస్తానన్నారు. అంతకుముందు అప్పన్నపల్లి నుంచి ప్రధాన రోడ్డు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగురావు నామాజీ, శ్రీవర్ధన్‌రెడ్డి, కొండయ్య, ఎగ్గని నర్సింహులు పాల్గొన్నారు.