మాదిగ జాతిని ఎదగనీయట్లేదు
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ జీవితమే ఒక కరప్షన్ అని, ప్రతిపక్షంలో ఉండీ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కుల అహంకారంతో రేవంత్‌రెడ్డి మాదిగలను అణగ దొక్కుతున్నారని మండిపడ్డారు. మాదిగలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నాడ ని, రేవంత్ వల్ల మాదిగ జాతి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. వందరోజుల పాలనతో రేవంత్ అంటే ఏంటో అర్థమైందన్నారు.
రెడ్డి ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లి ఏం చేస్తారు? గడ్డికొస్తారా అని ప్రశ్నించారు. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. మాదిగ జాతిని ఐక్యం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ఉన్నది సోనియా, రాహుల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని విమర్శించారు. రేవంత్ కాంగ్రెస్‌కు ఎవరూ ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. రేవంత్ ఇచ్చిన 30 వేల ఉద్యోగా లు కాంగ్రెస్‌వి కావు.. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినవే అన్నారు. తాను ఎక్కడకు పోనని, కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.