రక్షణ కల్పించాలని పహాడీ షరీఫ్ పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు
మహేశ్వరం, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుతో తనకు ప్రాణహాని ఉందంటూ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణుతో పాటు వినయ్, విజయ్, కిరణ్, రాజ్‌తో పాటు శివ పేర్లను ఆయన ఫిర్యాదులో చేర్చారు. వీరి వల్ల భవిష్యత్తులో తనతో పాటు తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన అన్నతో పాటు ఆయన అనుచరుల పై ప్రాణహాని ఉందని చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకొవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.