- ఆపద వస్తే కాదు... రాకుండా ఉండేలా చూద్దాం
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : నా లక్ష్యం.. నేను వేస్తున్న ప్రతి అడుగు.. అందరి సంక్షేమం కోసం మాత్ర మేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. యూనిక్ ప్యాలెస్ ఫంక్షన్ హాలు లో మహబూబ్ నగర్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మైనార్టీల సంక్షేమానికి రూ 45 కోట్లు మంజూరు చేసుకున్నందుకు మరింత అభివద్ధి జరుగుతుందని తెలిపారు. అవసరమైన సదుపాయాలు అన్నిటిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర అభివద్ధి తమ లక్ష్యం అని పేర్కొన్నా రు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మా నించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సి పల్ కౌన్సిలర్ మోయిన్ అలి, మక్సూద్, సాదుల్లా, ఖాజీ, గౌస్ సాబ్, అవాస్ సాబ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, అవేజ్, అజ్మత్ అలి, అఫ్రోజ్, జహీర్, ప్రవీణ్ కుమార్, మహ్మద్ రియా జుద్దీన్, తఖి, ఇమ్రాన్ ఖురేషీ పాల్గొన్నారు.