calender_icon.png 27 December, 2024 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా లక్ష్యం అవార్డులు కాదు

25-12-2024 12:42:52 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో డబుల్ కాంస్యాలతో మెరిసిన భారత షూటర్ మనూ బాకర్ ఖేల్త్న్ర అవార్డుకు నామినేట్ కాకపోవడంపై స్పందించింది. తన లక్ష్యం అవార్డులు కాదని.. వాటి కంటే దేశం కోసం ఆడడమే బాధ్యత అని మనూ పేర్కొంది. ప్రజల్లో గుర్తింపు, అవార్డు తనకు స్పూర్తినిస్తాయి.. కానీ అవే తన లక్ష్యాలు కాదని  ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. మనూ బాకర్‌ను ఖేల్త్న్రకు సిఫార్సు చేయకపోవడంపై క్రీడాభిమానులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నామినేషన్ ప్రక్రియలో ఏదో లోపం జరిగిందని దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తు న్నామని ప్రభుత్వం పేర్కొంది.