calender_icon.png 19 April, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా సినిమాలో.. నా రాజకీయ జీవిత ఘటనలే ఉంటాయి: జగ్గారెడ్డి

15-04-2025 12:00:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : తాను నటిం చే సినిమాలో తన రాజకీయ జీవిత సన్నివేశాలుంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు తనను మర్డర్ చేసే ప్లాన్ చేశాడని, ఆ మర్డర్‌కు బలి కాకుండా తాను ప్రతి వ్యూహం ఎలా చేశానో సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారు.

సోమవారం ఆయన మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. పోలీసుల నిర్బంధాలు, ఒత్తిళ్లను ధీటుగా ఎదుర్కొంటూ నిజ జీవితంలో ఎదిగిన తీరును ఈ మూడు పాత్రల ద్వారా చూపించబోతున్నామన్నారు. ఈ మూడు పాత్రలను వేరే నటుడు ఉంటారని చెప్పారు. ఈ సినిమాలో తన ప్రేమ కథ మాత్రం ఉండదని, ప్రేమికులకు అండగా నిలిచే పాత్రలో తానుంటానని జగ్గారెడ్డి చెప్పారు.