17-03-2025 01:40:58 AM
దర్శకుడు చూపెట్టిన ఫొటో చూసి కనెక్టయ్యా
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): తాను నటించబోయే సిని మాకు రాజకీయంతో ఎలాంటి సం బంధం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘జగ్గా రెడ్డి.. ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో నిర్మించనున్న సినిమాలో నటిస్తున్న సంద ర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
3 నెలల కింద సినిమా డైరెక్టర్ రామానుజం తనకు చూపెట్టిన ఫొటో చూసి కనెక్టయ్యానని తెలిపారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని, సినిమా తీసేందుకు సమయమిస్తారా? అని డైరెక్టర్ అడిగారని జగ్గారెడ్డి వివరించారు. సినిమాకోసం సమయం ఇవ్వలేనేమోనని అనుకున్నానని, కానీ డైరెక్టర్ చూపెట్టిన ఫొటో చూసి కచ్చితంగా నటించాలని నిర్ణయించుకున్న ట్టు చెప్పారు.
సినిమా క్యాప్షన్ ‘ఏ వార్ ఆఫ్ లవ్’ అనేది తనకు కథ చెప్పే ముందే రాసుకున్నారని ఆయన వెల్లడించారు. చిత్రకథలో తన లవ్ స్టోరీకి సంబంధం లేదని, డైరెక్టర్‌కు తన ప్రేమ గురించి చెప్పాక స్టోరీ లైన్ మార్చారని వెల్లడించారు. ఈ చిత్రం లో విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్‌గా ఉన్నప్పటి అంశాలు ఉంటాయని జగ్గారెడ్డి తెలిపారు. మొన్నటి ఢిల్లీ టూర్ తనను పూర్తిగా మార్చివేసిందని, ఈ పరిణామాలు ఎటు పోతా యో తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాది రోజు సినిమా షుటిం గ్ ప్రారంభం అవుతుందన్నారు.