విక్టరీ వెంకటేశ్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ మీనాక్షి చౌదరి పంచుకుంది. శుక్రవారం విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే...
‘సంక్రాంతికి వస్తున్నాం’లో భాగమైనందుకు -చాలా ఆనందంగా ఉంది. చాలా గ్రేట్ ఫుల్‌గా ఉన్నాను. -ఇది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని ఎమోషన్సూ ఉంటాయి. మేజర్ పోర్షన్ కామెడీ ఉంటుంది. ఫస్ట్ టైమ్ కామెడీ జోనర్ ట్రై చేశా. యాక్షన్ సీక్వెన్సులు చేయడం కూడా ఇదే మొదటిసారి. ముఖ్యంగా కామెడీ స్పేస్‌లో కాప్ రోల్ చేయడం ఉత్సాహాన్నిచ్చింది.
నన్ను కాప్ రోల్‌లో చూడటం ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతే. -కాప్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. లక్కీగా నా కెరీర్ బిగినింగ్‌లోనే రావడం సంతోషంగా ఉంది. రిఫరెన్స్ ఏమీ తీసుకో లేదు. మా డాడీ ఆర్మీ ఆఫీసర్. ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్‌పై ఐడియా ఉంది. నేను కూడా కొంత హోమ్‌వర్క్ చేశా. -వెంకటేశ్ గారితో పనిచేయడం సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఆయన వండర్ ఫుల్ హ్యూమన్.
చాలా ఫిట్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. సెట్‌లో కూ డా ఒక మంచి ర్యాపో ఉండేది. సీన్స్ అన్నీ ఫ్లోలో అద్భుతంగా జరిగాయి. -ఐశ్వర్య రాజేశ్ గారు ఎస్టాబ్లెస్ యాక్టర్. ఐశ్వర్య న టించిన చాలా సినిమాలు చూ శాను. ఒక ఫ్యాన్ మూమెంట్ లా అనిపించింది.
తను చాలా పాజిటివ్‌గా ఉంటారు. తన తో కలిసి పనిచేయడం హ్యాపీ గా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకు న్నా. -అనిల్ గారితో పనిచేయడం గొప్ప అనుభూతి ని చ్చింది. ఆయన కామెడీ టై మింగ్ ఫెంటాస్టిక్. కామెడీ తీ యడం అంత ఈజీ కాదు. సీన్ బెటర్‌మెంట్ కోసం స్పాంటేనియస్‌గా ఆలోచిస్తారు. నేను కామెడీ చేయ డం ఫస్ట్ టైమ్. ఆయన ప్రతిదీ చాలా ఓపికగా వివరించారు.
-దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఆనం దంగా అనిపించింది. శిరీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు చేయాలనుంది. దిల్ రాజు గారి నుంచి వస్తున్న ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతి వస్తున్నాం’ బిగ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా.
-నేను నటించిన సినిమాలో అన్ని పాటలూ సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు పాట సంచనల విజయాన్ని అందుకుంది. తర్వాత నా పేరు ‘మీను’ మీద వచ్చిన పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. -ఈ సినిమా ప్రమోషన్స్‌కు నా దగ్గర టైమ్ ఉంది.
కొత్త కొత్త ఐడియాలతో సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. వెంకీ మామ క్యారెక్టర్స్‌తో స్కిట్ చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియన్స్. గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదలయ్యిం ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం ఒక కలగా ఉంది.
నన్ను నేను నిరూపించుకునే కథలు, పాత్రలు రావడం సంతోషంగా ఉంది. -నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఏడాది కూడా నాకు వండర్‌ఫుల్‌గా ఉంటుందని ఆశిస్తున్నా” అని వివరించింది మీనాక్షి చౌదరి.