20-02-2025 12:00:00 AM
రష్మిక మందన్నా టాలీవుడ్‌కి వచ్చి స్టార్ హీరోయిన్‌గా మారింది. దీంతో కన్నడ ముద్దుగుమ్మలంతా రష్మిక దారిలోనే నడుస్తున్నారు. వారంతా రష్మిక మాదిరిగానే టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇక్కడ క్లిక్ అయితే బాలీవుడ్‌లో అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయనే ఆలోచన కూడా కన్నడ భామల్లో ఉండి ఉండవచ్చు.
కన్నడ బ్యూటి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘ఓంధ్ కథే హెల్లా’ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచమైంది. 2019లో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తరువాత రెండు, మూడు సినిమాల్లో చేసి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఓజి’ చిత్రంలో ప్రియాంక నటిస్తోంది.
సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దీనిలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ‘ఓజి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.
“ఓజి’ చిత్రం షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. పవన్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ మూవీలో మీరు కొత్త పవన్ కల్యాణ్‌ను చూస్తారు” అని ప్రియాంక చెప్పుకొచ్చింది.