calender_icon.png 23 January, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంవీఏ సీట్ల సర్దుబాటు కొలిక్కి

23-10-2024 01:07:14 AM

110 స్థానాల్లో కాంగ్రెస్ పోటీచేసే అవకాశం

ముంబై, అక్టోబర్ 22: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసిం ది. సీట్ల పంపకంపై మంగళవారం కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) నేతలు ముంబైలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ 105 నుంచి 110 వరకు, శివసేన (యూబీటీ) 90 నుంచి 95 సీట్లలో, శరద్ పవార్ పార్టీ 75 నుంచి 80 సీట్లలో పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయిం చినట్లు తెలిసింది. కాగా, అధికార మహాయుతి కూటమిలో కూడా  సీట్ల సర్దుబాటు కుదిరింది.  బీజేపీకి 152 నుంచి 155 సీట్ల వరకు దక్కా యి. శివసేనకు 80, ఎన్సీపీకి 54 సీట్లు కేటాయించినట్లు తెలిసింది.