calender_icon.png 14 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రలో ఎంవీఏదే అధికారం

12-11-2024 01:43:38 AM

ఔరంగాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  1. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తాం 
    1. ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిదే విజయమని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయని, మహారాష్ట్రలో ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఔరంగాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లాలా హన్మంత్‌రావుషేవాలే తరఫున ఉత్తమ్ ప్రచారం నిర్వహించారు.

అనంతరం ఔరంగాబాద్ డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు సచిన్ పైలట్‌తో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడు తూ.. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. మహారా ష్ట్రలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణిం చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ కూటమి మహారాష్ట్రలోని 48 సీట్లకు 31 స్థానాల్లో విజయం సాధించిందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమికి పట్టం కట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తంచేశారు.