సభ నుంచి వాకౌట్ చేసిన కూటమి ఎమ్మెల్యేలు
ముంబై, డిసెంబర్ 7: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహా వికాస్ అఘాఢీ(ఎంవీఏ) ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించా రు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయకుండానే సభ నుంచి వాకౌట్ చేశా రు. మహారాష్ట్ర అసెంబ్లీ శనివారం సమావేశం కాగా సీఎం దేవేంద్ర ఫ డ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సహా మహాయుతి అభ్యర్థులు ప్రమాణం చేశా రు. ఈవీఎంలపై అనుమానాలు ఉ న్నాయని, అందుకే ప్రమాణ స్వీకా రాన్ని బహిష్కరించినట్టు శివసేన నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు.