సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో హైటెన్షన్
ఆలయాన్ని సందర్శించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, తలసాని తదితరులు
మాధవీలత అరెస్ట్, రాజాసింగ్ హౌస్ అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని మోం డా మార్కెట్‌లో హైటెన్షన్ నెలకొంది. స్థానిక ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. ఆలయంలో శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు నింది తుడిని పట్టుకొని చితకబాదారు.
అనంతరం పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు సో మవారం అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. సమాచారం అందుకున్న కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించారు.
అదే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తదితరులు ఆలయం వద్దకు చేరుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు రావ డంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సం ఖ్యలో బలగాలను మోహరించారు.
ఆల యం వద్ద నిరసన తెలిపిన బీజేపీ నాయకురాలు మాధవీలత, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
నిజానిజాలు బయటపెట్టాలి : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు నిజానిజాలు బయటపెట్టాలి. నిందితులు మానసిక ఇబ్బం దులతో ఉన్నారనే స్టేటిమెంట్స్ ఇవ్వడం సరికాదు. నన్ను ఉగ్రవాదిలా హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయం.
ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది: బీజేపీ నాయకురాలు మాధవీలత
దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోం ది. హిందువులు ఐక్యంగా ఉండాలి.. కపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి.
దేవాలయాలపై దాడి చేయడమే పిచ్చోళ్ల పనా : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
హిందువుల దేవాలయాలపై దాడి చేయడమే పిచ్చోళ్ల పనా.. వారు ఇతర ఆలయాలపై దాడులు చేయరా?. ముత్యాలమ్మ ఆలయంపై పిచ్చోళ్లు దాడులు చేశారని పోలీసులు చెప్పడం ఆశ్చర్యమేసింది. ఇతర ఆలయాలపై దాడి జరిగితే పరిస్థితి ఇలాగే ఉండేదా?. విగ్రహాలను కాలితో తంతే కూడా పట్టించుకోరా?. కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి రాకపోగా కనీసం స్పందించడం లేదు.
ఆలయాలపై దాడులు జరిగినపుడు తాము స్పందిస్తే బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఉగ్రవాదులకు శిక్షణనిచ్చిన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిన ఒవైసీ పార్టీతో అంటకాగుతోంది కాంగ్రెస్సే. దేవాలయాలపై దాడుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో, ఎటువైపు ఉంటుందో తేల్చుకోవాలి.
దేవాలయాలపై వరుసగా దాడులు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నగరంలోని హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరు గుతున్నాయి. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. దేవాలయాలపై దాడికి పాల్పడు తున్న వారు మతిస్థిమితం లేకుండా చేస్తున్నారని పోలీసులు చెప్పడం సరికాదు. విగ్రహాలు ధ్వం సం చేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతా.
శాంతిభద్రతలు దిగజారుతున్నాయి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి తెలివి తక్కువ చర్యలు హైదరాబాద్ నగర సహనశీలతకు మచ్చ. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో గత నెలరోజులుగా శాంతి భద్రతలు దిగజారుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.
హిందువులకు రక్షణ లేకుండా పోయింది : రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హిందువులకు రక్ష ణ లేకుండా పోయింది. ఆలయాలపై దాడులకు పురిగొల్పుతున్న మతోన్మాద శక్తులపై వెంటనే చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం.
ఖండిస్తున్నాం : కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోయినొద్దీన్
ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వం సం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నారు. ఈ చర్యలను ఏఐఎంఐఎం పార్టీ ఖండిస్తోంది.
మనోభావాలను దెబ్బతీస్తే ఉపేక్షించం : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభా వాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు.
కఠినంగా శిక్షించాలి : మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిని వదల కూడదు. ఘటనతో సంబంధం ఉన్న దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.