29-03-2025 05:24:36 PM
రైతు సంఘం రాష్ట్ర కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పెద్దపీట..
ముత్యాల విశ్వనాథం ఎన్నికపట్ల హర్షంవ్యక్తం చేసిన పాల్వంచ రైతు సంఘం కమిటీ..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 24 నుండి 27 వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు రైతు సంఘం పాల్వంచ అధ్యక్ష కార్యదర్శులు కొంగర అప్పారావు, బానోత్ రంజిత్ శనివారం తలిపారు. ముత్యాల విశ్వనాథంతో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చండ్ర నరేంద్రే కుమార్ ను, రాష్ట్ర సమితి సభ్యులుగా కుమారి హనుమంతరావు, నరాటి రమేష్, గిరి, వాడే లక్ష్మి ఎన్నికయ్యారు. వీరి ఎన్నికపట్ల హర్షంవ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జరుపుల మోహన్, బాదే చెన్నయ్య, ఎడవల్లి క్రిష్ణ, భీమా నాయక్, ఆడెపు పెద్ద వెంకట్రామయ్య, ఆంగోత్ బాలాజీ, ఈసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.