calender_icon.png 24 October, 2024 | 7:03 PM

ముత్యాల సుబ్బయ్య కొత్త చిత్రం

02-08-2024 12:05:00 AM

ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య యాభైకి పైగా సినిమాలతో తెలుగు వారి ఆదరాభిమానాలను పొందారు. ఆరంభం లో సమాజాన్ని జాగృతం చేసే సినిమాలు తీసి, అటుపై చక్కటి కుటుంబ కథలతో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన ఆయన, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ముత్యా ల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్  నిర్మాతగా ఓ సినిమా ఆరం భం కానుంది. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులు.

ఆగష్టు 9న హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో  ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం జరుగనున్నట్టు చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు. విభిన్న కథాంశంతో కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాని మలచనున్నారు దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ). ఈ సినిమాకి మూల కథ: శరవణన్, కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి.